Young actor Raj Tarun, who has stuttered in recent times after an encouraging start to his film career, is looking to bounce back with his last films. his latest film rajugadu coming theaters very soon. on this we have a interview with director sanjana reddy.
#actorRajTarun
#rajugadu

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం రాజుగాడు. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సంధర్భంగా రాజుగాడు దర్శకురాలు సంజనా రెడ్డి తో ఇంటర్వ్యూ...
మాది శ్రీకాకుళం. చదువు పూర్తి అయ్యాక కొంతకాలం మాథ్స్ సబ్జెక్టు టీచర్ గా వర్క్ చేసాను. ఆ తరువాత ఆంధ్రజ్యోతి లో కొంతకాలం జర్నలిజం చేసాను. తరువాత రామ్ గోపాల్ వర్మ గారిదగ్గర రౌడి సినిమాకు దర్శకత్వ శాకలో పనిచెయ్యడం జరిగింది. ఆ అనుభవంతో సొంతంగా కథ రాసుకున్నాను.
నేను కథ రాసుకున్నప్పుడు ఈ కథకు ఎవరు సెట్ అవుతారని చూస్తున్నప్పుడు... రాజ్ తరుణ్ అయితే బాగుంటుంది అనిపించింది. రాజ్ తరుణ్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో సినిమా చేయ్యబోతున్నాడని తెలిసి రాజ్ తరుణ్ కు స్టోరీ చెప్పడం జరిగింది.
నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు రాజ్ తరుణ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిర్మాత అనిల్ సుంకర గారికి కథ బాగా నచ్చడంతో సినిమా వెంటనే ప్రారంభం అయ్యింది. సినిమాలో హీరో పేరు రాజు కావున రాజుగాడు పేరు పెట్టడం జరిగింది.
రాజుగాడు చిత్రంలో రాజ్ తరుణ్ క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో ఉంటాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే దొంగతనం చేయడం. మన చుట్టుపక్కల ప్రతి పది మందిలో ఒకరు ఈ వ్యాధితో ఉంటారు.