Mahanati movie has continued to make good collection at the US box office in the third weekend and it has become the sixth Telugu film to cross $2.5 million mark in the country in 19 days.
#Mahanatimoviecollection

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' చిత్రం మూడో వారంలోకి ఎంటరైనప్పటికీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఇంకా అదిరిపోయే వసూళ్లూ సాధిస్తూనే ఉంది. మూడో వారాంతం పూర్తి కావడంతో 19 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో 6వ స్థానంలో నిలిచింది. సాధారణ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంపై ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
యూఎస్ఏ బాక్సాపీసు వద్ద ‘మహానటి' 2.5 మిలియన్ వసూలు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ వైజయంతి మూవీస్ వారు ట్వీట్ చేశారు. సావిత్రమ్మ బాక్సాఫీసును రూల్ చేస్తోంది, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అంటూ అని పేర్కొన్నారు.
బాహుబలి 2 : $21 మిలియన్ బాహుబలి: $8.46 మిలియన్ రంగస్థలం: $3.51 మిలియన్ భరత్ అనే నేను: $3.41 మిలియన్ శ్రీమంతుడు: $2.89 మిలియన్ మహానటి: $2.50 మిలియన్ అ..ఆ: $2.44 మిలియన్ ఖైదీ నెం 150: $2.44 మిలియన్ ఫిదా: $2.067 మిలియన్ అజ్ఞాతవాసి: $2.065 మిలియన్