Surprise Me!

World No Tobacco Day : 8 Foods To Prevent Tobacco Use

2018-05-30 501 Dailymotion

ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం(వరల్డ్ నో టొబాకో డే) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం యొక్క ప్రధాన థీమ్ 'పొగాకు మరియు గుండె వ్యాధి'. ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకారం, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుండె సంబంధిత అనారోగ్యాలకు పొగాకు ఏరకమైన ప్రభావం చూపుతుంది, అని తెలియజేయడం కోసమే ఈ “థీం” రూపొందించబడింది. ఈ వ్యాసంలో పొగాకు వాడకాన్ని నివారించడానికి ఉపయోగపడే 8 ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుంటారు. <br />పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయేలా చేస్తుంది. WHO ప్రకారం, పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. దీని వల్ల నోటి కాన్సర్ , గొంతు కాన్సర్ , కిడ్నీ కాన్సర్ ,జీర్ణాశయం కాన్సర్ ,ఎముక మజ్జ కాన్సర్ ,అన్నవాహిక కాన్సర్, బ్లడ్ కాన్సర్(లుకేమియా), ఊపిరితిత్తుల కాన్సర్, గొంతు వెనక ఉండే హైపో ఫెరెంజియల్ కాన్సర్, నేసో ఫెరెంజియల్ కాన్సర్, స్వరపేటిక కాన్సర్ వంటి అనేక రకాల కాన్సర్లు వస్తాయని పూర్తి అధ్యయనాల ద్వారా తేలింది. అయినా ఈ పొగాకును వీడలేని దుస్థితిలో ఉన్నారు అనేకులు. <br />భారతదేశంలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ 6.9 శాతం ఉండగా, అన్ని క్యాన్సర్-సంబంధిత మరణాలలో 9.3 శాతంగా ఉంది. ఈ లెక్కలు స్త్రీ-పురుషులిద్దరికీ వర్తిస్తాయి. పొగాకు వాడకం కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, మరియు పెరిఫెరల్ వస్క్యులర్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. <br />ధూమపానం నుండి మిమ్మల్ని మీరు నివారించడానికి, నికోటిన్ కోరికలను తగ్గించడానికి మీ ఆహారం ప్రణాళికలో భాగంగా తీసుకోదగిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

Buy Now on CodeCanyon