The strong bond between Mumbai Indians teammates Kieron Pollard and Hardik Pandya is well known. The Indian all-rounder had even termed the West Indian as a 'brother from another mother.'
#mumbaiindians
#kieronpollard
#hardikpandya
#krunalpandya

'ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దు.. 40 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకో' టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు తన అన్న కృనాల్ పాండ్యా ఇచ్చిన సలహా ఇది. భారత క్రికెట్ అభిమానులకు పాండ్యా బ్రదర్స్ సుపరిచితం. వీరి గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరూ ఎన్నో అద్భుత ప్రదర్శనలు కనబర్చారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా రాణిస్తుంటే, అన్న కృనాల్ పాండ్యా మాత్రం భారత జట్టులో చోటుదక్కకున్నా ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.
2017 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచి ముంబై టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ ఆల్‌రౌండర్స్ అయినప్పటికి ఒకరు పేసర్ కాగా, మరొక స్పిన్నర్. తాజాగా ఐపీఎల్ 11వ సీజన్ ముగిసిన అనంతరం 'వాట్‌ద డక్ షో'లో పాల్గొన్న ఈ అన్నదమ్ములు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తమకు వెస్టిండిస్ క్రికెటర్లంటే అమితమైన ప్రేమ అని చిన్నప్పటి నుంచే వారిపై ఇష్టం కలిగిందని పాండ్యా బ్రదర్స్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ సందర్భంగా ఓ సందర్భంలో ఈ సోదరులు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ పెద్దన్న అని సంబోధించిన సంగతి తెలిసిందే. అయితే చిన్నప్పుడు ఎక్కువగా వెస్టిండీస్ మ్యాచ్‌లు చూడటంతో వారిపై ఇష్టం కలిగిందని, వారిలో ఏదో ప్రత్యేకత ఉందని... చాలా యాక్టివ్‌గా ఉంటారని అన్నారు.