Man went in Annapurna Studios. Police begins enquiry on it <br /> <br />అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందిన వార్త సంచలనంగా మారింది. నారాయణరెడ్డి (53) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో అన్నపూర్ణ స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అతడి మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారట. <br />మృతుడి కుటుంబ సభ్యులకు సైతం తెలియకుండా ఆసుపత్రికి తరలించడం పట్ల పలు అనుమానాలు మొదలయ్యాయి. నారాయణరెడ్డి ఎలా మరణించాడు, ఎప్పుడు మరణించాడు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. <br />జూబ్లీహిల్స్ పోలీసులు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకొని విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హత్య జరిగి ఉంటుందనే అనుమానాల్ని కూడా మృతుడి బంధువులు వ్యక్తపరుస్తున్నారు. గత ఏడాది కూడా అన్నపూర్ణ స్టూడియోలో అనుకోకుండా భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
