Nava Nirmana Deeksha 2018 : Chandrababu Naidu Speech<br /><br />జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఏపీకి తీరని ద్రోహం చేశామని మండిపడ్డారు.<br /><br />ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ వేదికగా శనివారం నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం చేసేలా గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ దీక్షను చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.