Surprise Me!

Abhimanyudu Producer Hari Press Meet

2018-06-05 1 Dailymotion

Abhimanyudu movie box office collections. Vishal gets hit after long time
#Abhimanyudu
#vishal

300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి...స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు గుజ్జ‌ల‌పూడి హ‌రి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయ‌న హీరోగా న‌టించిన రాయుడు, ఒక్కడొచ్చాడు, డిటెక్టివ్ చిత్రాలు త‌ర్వాత రీసెంట్‌గా విడుద‌లైన అభిమ‌న్యుడు సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు నిర్మాత హ‌రి. రీసెంట్‌గా మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అభిమన్యుడు.
ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించారు. జూన్ 1న విడుద‌లైన ఈ సినిమాతో నిర్మాత‌గా చాలా పెద్ద హిట్‌ను అందుకున్నారు నిర్మాత హ‌రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్స్ .. నైజాం 2.90 కోట్ల రూపాయలు, వైజాగ్ 75 ల‌క్ష‌లు, సీడెడ్ 68 ల‌క్ష‌లు, కృష్ణా 56.46 ల‌క్ష‌లు, గుంటూరు 53 ల‌క్ష‌లు, నెల్లూరు 26 ల‌క్ష‌లు, ఇత‌ర ప్రాంతాలు 70 ల‌క్ష‌లు ... మూడు రోజుల్లో 7.10 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి విశాల్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత గుజ్జ‌ల‌పూడి హ‌రి మాట్లాడుతూ సినిమా మేం ఊహించిన దాని కంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. నా మిత్రులైన డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నాలుగేళ్లుగా మంచి విజ‌యం కోసం వెయిట్ చేసిన నాకు ఈ సక్సెస్‌తో ఆనందంగా ఉంది. డిజిట‌ల్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సామాన్యుడు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు. దాంతో సినిమాకు ప్రేక్ష‌కులు చ‌క్క‌గా క‌నెక్ట్ అయ్యారు.

Buy Now on CodeCanyon