Rajinikanth's Kaala movie getting ready to release on June 7th. In this occassion, Kaala Audio function organised in Hyderabad on June 4th. <br /> <br />పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కబాలి తర్వాత రజనీకాంత్‌తో పా రంజిత్ వరుసగా మరో సినిమాను రూపొందించడం గమనార్హం. ముంబైలోని మురికివాడ ధారవిలో నివసించే తమిళ వలస జీవుల హక్కుల కోసం పోరాడే పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. <br />కాలా మూవీ రిలీజ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సందడి పెరిగిపోతున్నది. ఫ్యాన్స్ జోష్ చూసిన పలు కంపెనీలు అనేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెరికాలో ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల వ్యవహారం ఎక్కువగా కనిపిస్తున్నది. రెండు టికెట్లు కొంటే 10 డాలర్లు తగ్గింపు అని ఆఫర్‌ను కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అలాగే సినీ మార్క్ మూవీ క్లబ్ అనే కంపెనీ కూడా తొలిసారి తమ క్లబ్ చేరితే 5 డాలర్లు డిస్కౌంట్ అని పేర్కొన్నది.
