Surprise Me!

Allu Arjun Makes Sensational Comments On Pawan Kalyan & Janasena Party

2018-06-06 2,890 Dailymotion

Stylish star Allu Arjun made sensational comments on Power star Pawan Kalyan and Jana Sena Party. He posted a statement in Instagram that LIVE BY YOUR TRUE MADNESS THE WORLD WILL ADJUST.

గత కొద్దికాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు కనిపించాయి. అందుకు తగినట్టుగా రెండు వర్గాల మధ్య.. ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, అల్లు అర్జున్‌కు మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. కానీ ఇటీవల ఓ వివాదం కారణంగా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలందరూ ఒకే తాటిపైకి వచ్చారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది.
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తన ఇన్స్‌టాగ్రామ్‌లో సెన్సేషనల్ కామెంట్ చేశారు. జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఫోటోను పెట్టి ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
ప్రజలకు సేవ చేయాలనే మీ పిచ్చి తగినట్టుగానే జీవించింది. అందుకు తగినట్టు సర్దుకుపోయి ప్రపంచమే మీ వెంట నడుస్తుంది అని పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు.
పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ చేసిన కామెంట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా బాగున్నది.. మంచిగా చెప్పారు.. మంచి కొటేషన్ అంటూ కొందరు స్పందించారు. అయితే మరికొందరు ప్రతికూలమైన కామెంట్లతో ట్రోల్ చేయడం కూడా కనిపించింది.

Buy Now on CodeCanyon