రజనీకాంత్.... ఈ పేరుకు ఉన్నంత క్రేజ్ దేశంలో బహుషా మరే స్టార్ హీరోకు ఉండదేమో? భారత్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఆయా ప్రాంతీయ భాషలకు సంబంధించిన సినీ పరిశ్రమలు వేర్వేరుగా ఉన్నాయి. సినిమా మార్కెట్లో అక్కడి లోకల్ స్టార్లే కింగ్స్. అయితే ఇందుకు భిన్నంగా అన్ని చోట్లా తన సినిమాలంటే పడిచచ్చేలా క్రేజ్ సంపాదించుకుంది మాత్రం ఒకే ఒక్క స్టార్.... సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకి ఇంత ఇంత ఆదరణ లభించడానికి కారణం ఆయన యూనిక్ స్టైల్, మాస్ అప్పియరెన్స్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా విడుదలైన రజనీ తాజా మూవీ 'కాలా'తో ఇండియా వ్యాప్తంగా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.<br /><br />
