Date fix for SyeRaa first look. RamCharan wants to release first look on Megastar's birth day <br /> <br />మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సైరా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చిందని వార్తలు వస్తున్నాయి. <br />ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సైరా ఫస్ట్ లుక్ తో ఫాన్స్ ని ఖుషి చేయాలనీ రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా అంగీకారం తెలిపాడట. <br />తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన వీర గాధని సైరా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి లుక్ లో మెగాస్టార్ చిరంజీవి ఎలా ఉంటాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.