వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.వరుణ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. వరుణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటిస్తోంది. ఘాజి చిత్రంతో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలో ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లోని ఓ పిక్ ని అదితి రావు సోషల్ మీడియాలో పంచుకుంది.<br />
