Indian 2 is my political launchpad. Kamal Haasan reveals interesting details about Indian 2

విశ్వ నటుడు కమల్ హాసన్ కలల ప్రాజెక్ట్ విశ్వరూపం 2 విడుదలకు రంగం సిద్ధం అయింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఆగష్టు 10 న విడుదలకు సిద్ధం అవుతోంది. సోమవారం విడుదలైన విశ్వరూపం 2 ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భారతీయకుడు 2 చిత్రం గురించి కూడా కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు.
విశ్వరూపం చిత్రం వివాదానికి గురికావడం కేవలం రాజకీయమే కారణం అని కమల్ హాసన్ అన్నారు. ఇకపై అలాంటి రాజకీయాలు చేయలేరని, ఎందుకంటే తాను కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడినే అని కమల్ అన్నారు.
విశ్వరూపం 2 చిత్రం తన పొలిటికల్ లాంచింగ్ కు ఉపయోగపడే చిత్రం కాదని, ఈ చిత్రంలో రాజకీయ అంశాలు ఉండవని స్పష్టం చేశారు. విశ్వరూపం చిత్రానికి ఇది కొనసాగిపు మాత్రమే అని తెలిపారు.
భారతీయుడు 2 చిత్రం గురించి కమల్ హాసన్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. దానికి సీక్వెల్ గా రాబోతున్న భారతీయుడు 2 చిత్రం పూర్తిగా రాజకీయ చిత్రం అని కమల్ హాసన్ అన్నారు. ప్రస్తుత రాజకీయాలతో విసిగిపోయిన వారి ఆలోచనలకు అద్దం పట్టేలా ఆచిత్రం ఉంటుందని కమల్ స్పష్టం చేశారు.