Aakasamlo aasala harivillu Audio launch took place in hyderabad. directed by kranthi kranthi <br /> <br />ఈ సందర్బంగా నవ్యంద్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్ వి ఎన్ రావు మాట్లాడుతూ .. అచ్చమైన తెలుగు టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ట్రయిలర్ బాగుంది. మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చాలా సినిమాలు నిరూపించాయి. అలాగే నిర్మాత సత్య శ్రీ అన్ని విషయాల్లో ముందుండి ఈ సినిమాను నడిపించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధించి ఈ యూనిట్ కు మంచి విజయాన్ని అందివ్వాలి అన్నారు. <br />నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ .. మహానటి తరహాలో ఈ సినిమా నిర్మాత సత్య శ్రీ ముందుండి అన్ని పనులు చూసుకుంది. మహిళలు కూడా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణం. అలాగే చక్కని పేరుతొ వస్తున్నా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. హీరో హీరోయిన్లు చక్కగా ఉన్నారు. అలాగే మంచి టెక్నీకల్ టీమ్ కుదిరింది. ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కురొకుంటున్నాను అన్నారు. <br />చిత్ర దర్శకుడు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ .. రెండో చిత్రం . మొదటి సినిమాకూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సత్య శ్రీ గారికి ధన్యవాదాలు, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు.
