Bigg Boss 1 contestant Jyothi Opinion on Bigg Boss Season 2. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations. Story first published: Wednesday, June 13, 2018, 17:09 [IST]
#Bigg Boss1contestantJyothi
#Nani

నాని హోస్ట్‌గా ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 2పై.... తొలి సీజన్ కంటెస్టెంట్, నటి జ్యోతి స్పందించారు. తొలి సీజన్ బిగ్ బాస్‍లో తారక్ దడ పుట్టించాడు, నాని హెస్టింగ్ అలా అనిపించడం లేదని, అందుకు కారణం ఈ షోలో పాల్గొంటున్న అందరికీ నాని మంచి ఫ్రెండ్. అందుకే వారిలో ఆ దడ కనిపించడం లేదు అని జ్యోతి తెలిపారు.
మేము చేసిన బిగ్ బాస్ సీజన్ 1తో పోల్చుకుంటే తారక్ ఆ షోను ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రతివారం ఆయన వచ్చే రెండు రోజులు టీఆర్పీ రేటింగ్స్ స్టాండర్స్ కూడా బాగా పెరిగాయి. ఆ రెండు రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండే మాలో దడ ఉండేది. నాని చేస్తున్నపుడు ఆ ఫీల్ లేదు. ఎందుకంటే నాని జస్ట్ ఫ్రెండ్ లైక్... మన నానియే కదా అనే ఫీలింగ్ అయితే కంటెస్టెంట్స్‌లో కనిపిస్తోంది. అఫ్ కోర్స్ నా ఫేవరెట్ హీరోల్లో నాని ఒకరు.... అని జ్యోతి తెలిపారు.
నాని కూడా బాగా చేస్తున్నాడు. మెల్లి మెల్లిగా అతడు ఇంకా ఇంప్రూవ్ అవుతాడని భావిస్తున్నాను. ఎందుకంటే హోస్ట్‌గా నాని చేస్తున్నతొలి షో ఇదే. నాని మరింత బాగా చేయాలని, క్యూరియాసిటీ, స్పాంటేనిటీ ఇంకా పెరిగితే బావుంటుంది అనిపిస్తుందని జ్యోతి అభిప్రాయ పడ్డారు.