Surprise Me!

M S Dhoni Talks About His Diet Plan & Fitness Secrets

2018-06-14 135 Dailymotion

ఫిట్‌నెస్‌ కోసం తనకిష్టమైన చికెన్‌, మిల్క్‌షేక్స్‌, చాక్లెట్స్‌కు దూరమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తెలిపారు. 36 ఏళ్ల సీనియర్‌ క్రికెటర్‌ అయిన ధోనీ ఫిట్‌నెస్‌ విషయంలో 20 ఏళ్ల యువ ఆటగాళ్లతో సైతం పోటీపడతాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా సరదాగా టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాతో పరుగు పందెంలో కూడా ధోనినే నెగ్గాడు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. <br />గతంలో ఇక వికెట్ల మధ్య ధోనితో పరుగెత్తాలన్నా సహచర ఆటగాళ్లుకు సవాలే. ఇటీవల ఐపీఎల్‌ సందర్భంగా తన సహచర ఆటగాడు డ్వేన్‌ బ్రావోతో త్రీ రన్స్‌ ఛాలెంజ్‌లో ధోనినే నెగ్గిన విషయం తెలిసిందే. <br />ఫిట్‌నెస్‌ కోసం ధోనీ తనకెంతో ఇష్టమైన ఎన్నో ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. ధోనీకి చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ, ఫిట్‌గా ఉండేందుకు వాటన్నింటినీ దూరం పెట్టినట్లు ధోనీ చెప్పాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడాడు. <br />తప్పనిసరిగా మారాలి. మెరుగైన ఫలితాలు సాధించాలనుకున్నప్పుడు కొన్ని మార్పులు అవసరం. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నాను. బట్టర్‌ చికెన్‌, నాన్‌, మిల్క్‌ షేక్స్‌, చాక్లెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకునేవాడిని. ఎప్పుడైతే నేను 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టానో అప్పటి నుంచి చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌ తీసుకోవడం మానేశాను'

Buy Now on CodeCanyon