Kollywood audience were in surprise when they realised that not many from Tamil films were attending the Jio 65th Filmfare Awards. <br /> <br />సినిమా స్టార్స్ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్స్ హాజరైనప్పటికీ.... తమిళం నుండి పెద్ద స్టార్స్ మాత్రం రాలేదు. కొందరు చిన్న స్టార్స్ మాత్రమే ఈ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. అయితే వీరు ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి గల కారణం ఏమిటో తెలిసి పోయింది. డబ్బు ఇవ్వక పోవడం వల్లనే వారంతా ఫిల్మ్ ఫేర్ వేడుకను బాయ్‌కాట్ చేశారని ప్రచారం జరుగుతోంది. <br />గతంలో సినిమా రంగానికి సంబంధించి ఫంక్షన్లు, అవార్డ్స్ సెర్మనీలు, డాన్స్ ప్రోగ్రామ్స్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ జరిగినపుడు నటులంతా పాల్గొనేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కమర్షియల్ అయిపోయాయి. భారీగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆయా ఆర్గనైజేషన్స్ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అవి కమర్షియల్ అయ్యాయి కాబట్టే.... తమిళ సినీ నటుల సంఘం కూడా అభివృద్ధి పనులు కోసమని భారీ మొత్తం డొనేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.