Telugudesam party and YSR Congress of words over Chandrababu Naidu - PM Modi and Buggana and Akula Satynarayana Delhi meetings.
#Telugudesamparty
#ChandrababuNaidu

అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ మధ్య ఢిల్లీ అంశంపై మాటల యుద్ధం నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో భేటీపై టీడీపీ నేతలు విమర్శలు చేయగా, ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో చేయి కలపడంపై వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. వైసీపీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తోన్నట్లుగా కనిపిస్తోంది. ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ వారినైనా కలవవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఎవరిని కలిసినా చర్చనీయాంశం కావడం లేదా విమర్శలకు తావివ్వడం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రజాప్రతినిధిగా ఉన్న విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో తచ్చాడటంపై టీడీపీ విమర్శలు చేసింది.
విజయసాయి రెడ్డి కూడా ఓ ప్రజాప్రతినిధి. ఆయన రాజ్యసభ సభ్యులు. ప్రధానిని ఎవరైనా కలువవచ్చునని బీజేపీ, వైసీపీ నేతలు చెప్పారు. అయితే తమకు అపాయింటుమెంట్ ఇవ్వలేదని, ఓ క్రిమినల్‌కు ఇచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. దానికి వైసీపీ కూడా ఘాటుగానే స్పందించింది. జగన్, విజయసాయిలు ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టులో నిర్ధారణ కాలేదని, కానీ చంద్రబాబు ఎన్నో కేసుల్లో కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు.
ఆ విషయం కొన్నాళ్లకు సమసిపోయింది. అది ముగిసిందో లేదో మళ్లీ బుగ్గన - ఆకుల సత్యనారాయణలు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని టిడిపి నేతలు పదేపదే టార్గెట్ చేశారు. బుగ్గన బీజేపీ చీఫ్ అమిత్ షా, రామ్ మాధవ్‌లను కలిశారని, దీంతోనే వారి మధ్య ఉన్న లాలూచీ అర్థమవుతోందని టీడీపీ విమర్శించింది.