Surprise Me!

చంద్ర బాబు పై విరుచుకుపడ్డ వైయస్ జగన్ మోహన్ రెడ్డి

2018-06-19 548 Dailymotion

YSRCP president YS Jaganmohan Reddy on Tuesday fired Andhra Pradesh CM Chandrababu Naidu for barbers issue.
#YSJaganmohanReddy

తమకు కనీస వేతనాలు కల్పించాలంటూ నిరసన తెలిపిన క్షురకుల(నాయీ బ్రాహ్మణులు)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
సోమవారం సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన క్షురకులకు కనీస వేతనం ఇవ్వడం కుదరదని, జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని తేల్చి చెప్పారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించడంతో తమాషాలు చేస్తున్నారా? అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే.
మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న(సోమవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను' అని జగన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
అంతేగాక, ‘తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని చంద్రబాబు బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి' అని జగన్ దుయ్యబట్టారు.

Buy Now on CodeCanyon