Surprise Me!

అర్హులందరికీ పక్కా ఇళ్లు, కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

2018-06-20 1 Dailymotion

Andhra Pradesh cabinet meet held on Tuesday. key decisions were taken on this meeting. <br /> <br />మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణానికి ప్రధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రూ.500 కోట్లతో ప్రైవేటు భూముల కొనుగోలు చేయనున్నారు. . <br />ఇక అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. కాకినాడ తొండంగి దగ్గర పోర్ట్‌, తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్-2 అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కమ్యూనికేషన్‌ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఓకే చెప్పారు. <br />ఉచిత ఇసుకపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక రీచ్‌లను స్వాధీనం చేసుకొని... మహిళా సంఘాలకు అప్పగించాలని భావిస్తోంది. అలాగే కొత్తగా లక్షమందికి పెన్షన్లు మంజూరు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

Buy Now on CodeCanyon