Surprise Me!

England Set New Record For The Highest ODI Total

2018-06-20 500 Dailymotion

England put on a batting masterclass, shattering ODI records in the process, as they thrashed a shell-shocked Australia by 242 runs to clinch the five-match series in style. Eoin Morgan's side had posted their highest 50-over total against Australia in this format to take a 2-0 lead last time out in Cardiff, but they blew that score of 342-8 out of the water with a scintillating display at Trent Bridge. <br /> <br />వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుపై ఆద్యంతం ఇంగ్లాండ్ తన ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలుచుకున్న ఇంగ్లాండ్, మంగళవారం జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. <br />నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగి మూడో వన్డేలో మోర్గాన్‌ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే-నైట్‌ వన్డేలో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా 2016లో పాకిస్థాన్‌పై చేసిన 444 పరుగుల రికార్డును ఇంగ్లాండ్ తానే బద్దలు కొట్టింది. <br />ఒకానొక దశలో 500 పరుగుల మైలురాయిని చేరుకుంటుందని భావించినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 481 పరుగులతోనే సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో అలెక్స్‌ హేల్స్‌ (92బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్‌ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేశారు.

Buy Now on CodeCanyon