Ronaldo's diving header after four minutes of Portugal's 1-0 World Cup Group B win saw him surpass the great Ferenc Puskas as the most prolific European of all-time in international football. <br /> <br />ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో మరోసారి మెరుపు ప్రదర్శన చేశాడు. గ్రూపు-బిలో మొరాకోతో జరుగుతున్న మ్యాచ్‌లో రొనాల్డో 4వ నిమిషంలోనే హేడర్‌గోల్‌తో పోర్చుగల్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి నుంచి ఇరు జట్లు బంతిని నియంత్రణలో ఉంచుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి. <br />మ్యాచ్ ఆరంభమైన నాలుగు నిమిషాలకే గోల్ కొట్టి అదరగొట్టాడు. తనదైన శైలిలో హెడర్ గోల్‌తో పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. రొనాల్డో వేగాన్ని చూసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆశ్చర్యపోయారు. తరువాత తేరుకున్న మొరాకో గట్టిగానే పుంజుకుంది. ఆ తర్వాత ఇరు జట్లు బంతిని నియంత్రించేందుకు గట్టిగానే పోటీపడ్డాయి <br />రెండు జట్లు గోల్‌పోస్ట్‌లపై ఎటాకింగ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రథమార్థంలో రెండు టీమ్‌లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు పోరాడాయి. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న పోర్చుగల్ 1-0గోల్‌తో విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్‌తో ఇరాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన మొరాకోకు మరోసారి నిరాశ తప్పలేదు.
