Megastar Chiranjeevi Speech Vijetha Audio Launch Event. Remembers his VIjetha movie <br /> <br />మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో టాలీవడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడు నటిస్తున్న విజేత చిత్రం చుట్టూ పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ప్రతిష్టాత్మకమైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. నూతన దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం రోజు ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి ముఖ్యఅతిథి కాగా, రాజమౌళి, కీరవాణి అతిథులుగా హాజరయ్యారు. ఆడియో వేడుకలో విజేత థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. <br />ఆడియో వేడుకలో చిరు ప్రసంగించారు. విజేత అనే టైటిల్ వినగానే తనకు తాను నటించిన విజేత చిత్రం గుర్తుకు వస్తుందని చిరు అన్నారు. అప్పట్లో తాను వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్న సమయంలో విజేత సినిమా చేసానని చిరు తెలిపారు. <br />నూతన హీరోగా పరిచయం అవుతున్న కళ్యాణ్ కు ఎలాంటి ఇమేజ్ లేదు. కథ పరంగా ఇది అనుకూలించే అంశం అని చిరు అన్నారు. ఈ చిత్రానికి తన విజేత చిత్రంతో పోలికలు ఉన్నాయని చిరంజీవి తెలిపారు.