Modi Appreciated Rashid Khan for playing good in matches .he tweeted about rashid khan in mann ki bath programme.
#narendramodi
#rashidkhan

అఫ్గానిస్తాన్ క్రికెట్ యువ సంచలనం రషీద్ ఖాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీ రషీద్‌పై ప్రశంసలు గుప్పించారు. రషీద్ ఖాన్‌ను క్రికెట్ ప్రపంచానికి గొప్ప ఆస్తిగా అభివర్ణించిన మోదీ.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రషీద్ ప్రదర్శన అద్భుతమని కొనియాడారు.
మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ.. ఇటీవల ఆ దేశ క్రికెట్ జట్టు భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్, అప్ఘాన్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ చారిత్రకమైందిగా ప్రధాని అభివర్ణించారు. అప్ఘాన్ భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసింది.
ఈ మ్యాచ్ ముగిశాక కప్‌తో గ్రూప్ ఫొటో దిగడం కోసం భారత జట్టు అప్ఘాన్ ఆటగాళ్లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. భారత జట్టు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందన్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున రషీద్ సంచలన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.