Venkatesh, Varun Tej F2 movie launched. Anil Ravipudi directing this movie
#VarunTej
#AnilRavipudi
#Venkatesh

మరో ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ చిత్రం మొదలయింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందబోయే ఎఫ్ 2( ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. వెంకీ, వరుణ్ తేజ్ కు జోడిగా ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి అతిధిగా హాజరయ్యారు. పూర్తి వినోదాత్మక కథతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.
వెంకీ గతంలో కూడా కొన్ని మల్టి స్టారర్ చిత్రాల్లో నటించాడు. మెగాహీరోతో నటించడం వెంకీకి ఇది రెండవసారి. గతంలో వెంకీ చిత్రం గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. చిత్ర వర్గాల్లో, అభిమానుల్లో ఎఫ్ 2 చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. జులై నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు