batsman Umar Akmal has been served a show cause notice by the country's cricket board for failing to report a approach before the 2015 World Cup match against arch-rivals India. <br /> <br />పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌తో మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ''2015 వరల్డ్ కప్‌లో భారత్‌తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు" అని అక్మల్ అన్నాడు. <br />అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, మరోసారి ఇలాంటి ఉద్దేశాలతో నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా చెప్పా'' అని అక్మల్ చెప్పాడు. ఈ సంచలన ఆరోపణలపై ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి.