Surprise Me!

Fifa World Cup 2018 : Columbia Wins On Poland

2018-06-25 98 Dailymotion

Monaco striker Falcao stroked home his 30th international goal, making him the first player from Colombia to reach such a milestone, midway through the second half of a cagey encounter in Kazan, where defeat for either side would have meant elimination from the competition.

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో కొలంబియా విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో కొలంబియా ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.
ఈ క్రమంలో ఆట 40వ నిమిషంలో యోర్రి మైనా తొలి గోల్‌ నమోదు చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి కొలంబియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో కొలంబియా ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై పదే పదే దాడులు చేశారు.
ఈ క్రమంలో 70వ నిమిషంలో రాడమెల్‌ ఫాల్కా మరో గోల్‌ చేయడంతో కొలంబియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 75వ నిమిషంలో కుడ్రాడో మరో గోల్‌ చేయడంతో కొలంబియా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. వరల్డ్ కప్‌లో కుడ్రాడోకి ఇది రెండో గోల్‌ కావడం విశేషం.
2014లో జరిగిన వరల్డ్ కప్‌లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడ్రాడో తొలి గోల్‌ నమోదు చేశాడు. మ్యాచ్ మొత్తం పోలెండ్ ఆటగాళ్లు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. దీంతో మ్యాచ్‌ ముగిసేలోపు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయారు. దీంతో కొలంబియా 3-0తో పోలెండ్‌పై విజయం సాధించింది.

Buy Now on CodeCanyon