Amaravathi:Andhra Pradesh chief minister N Chandrababu Naidu on Monday wrote a letter to central minister for water resources Nitin Gadkari seeking reimbursement of Rs 1935.41 crore to the State for the Polavaram project. <br /> <br />కేంద్రం ప్రభుత్వంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ఈ లేఖ రాశారు. <br />ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ గడ్కరీకి రాసిన లేఖలో సిఎం చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణం తో పాటు నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1935 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. <br />పోలవరం ప్రాజెక్ట్ కు ఈ ఏడాది మే నెలాఖరు నాటికి రూ.13,798.54 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తన లేఖలో వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 8,662.67 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం మాత్రం రూ.6,727.26 కోట్లు మాత్రమే అందించిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. అందువల్ల తమకి కేంద్రం నుంచి మరో 1935.41 కోట్లు రావాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.