YSRCP MLA RK Roja on Thursday lashed out at Andhra Pradesh minister Nara Lokesh for his faults comments on development.
#naralokesh
#rkroja
#ysrcongress
#tdp
#bjp
#chandrababunaidu

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రోజా గురువారం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ నిజంగా పప్పు అని మరోసారి రుజువు చేసుకున్నారని రోజా వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని రోజా అన్నారు.
కంపెనీలు తెచ్చామని లోకేష్ గొప్పులు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిదిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఏంకేమని పిలవమంటారని రోజా ప్రశ్నించారు. పప్పు అంటే విటమిన్ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబుకు త్వరలోనే తెలుస్తుందని అన్నారు.
గత నాలుగేళ్లలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో 20లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని లోకేష్ గొప్పలు చెబితే పచ్చ పత్రికలు అదే విషయాన్ని రాశాయని అన్నారు. కానీ, కేవలం 16,900కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని నివేదికల్లో తేలిందన్నారు.