Surprise Me!

చంద్రబాబు ద్వంద విధానాల పై సిపిఎం నేతల ఆగ్రహం

2018-06-29 75 Dailymotion

The CPM leaders have been blaming the TDP government for ruined their hunger strike through midnight unnecessary interruptions
అనంతపురంలో రైతుల కోసం సిపిఎం నేతలు చేస్తున్న దీక్షలను రెండో రోజే అకారణంగా పోలీసులతో అరెస్ట్ చేయించి భగ్నం చేయడంపై టిడిపి ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిడిపి ప్రభుత్వం ద్వంద విధానాలతో, నియంతృత్వ పోకడలతో విపక్షాలను అణచివేయాలని చూస్తోందని, అందుకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపి దీక్ష చేస్తుంటే ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతూనే రాజకీయ ప్రయోజనాల కోసం దీక్ష కొనసాగేలా సహకరిస్తున్న టిడిపి ప్రభుత్వం సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల నేతలను మాత్రం దీక్షలు చేయనీయకుండా బలవంతంగా అణచివేస్తోందని సిపిఎం నేతలు విమర్శిస్తున్నారు.
అనంతపురంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం 8 మంది సిపిఎం నేతలు ఆమరణ నిరాహారదీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా దీక్షలు చేస్తున్న సిపిఎం నేతలపై గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా పోలీసులు విరుచుకుపడ్డారు. రాత్రి రెండుగంటల ప్రాంతంలో దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు అనూహ్యంగా శిబిరంపై విరుచుకుపడి బలవంతపు అరెస్ట్‌లకు దిగారు. నిద్రపోతున్న వారిని కనీసం లేపకుండానే అలాగే మోసుకొంటూ తీసుకెళ్లి వ్యాన్‌ల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఆకస్మిక చర్య నుండి దీక్షలో ఉన్నవారు తేరుకునే లోపే ఆస్పత్రికి తరలించి భంగం చేయడానికి ప్రయత్నించారు.

#andhrapradesh
#ananthapuram
#cpmleaders
#tdpgovernment
#hungerOppose
#farmersproblems

Buy Now on CodeCanyon