Renu Desai strong warning to Pawan Kalyan fans. She made sensational comments on her divorce <br />పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని విసిగిస్తున్నారంటూ చాలా రోజులుగా రేణుదేశాయ్ చెబుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమె రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ కు అభిమానుల తాకిడి ఎక్కువైంది. సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ పేరుతో ట్రోలింగ్ జరుగుతోంది. విసుగెత్తిపోయిన రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాని క్లోజ్ చేశారు. తాజగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తికి రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై సంచలనం రేపే విధంగా ఉంది. ఈ రిప్లైతో రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. <br />స్వయంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా రేణు దేశాయ్ కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ పవన్ ఫాన్స్ మాత్రం రేణు దేశాయ్ ని ట్రోల్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. <br />ఓ అభిమాని వ్యాఖ్యలకు రిప్లై ఇస్తూ రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన విడాకుల ప్రస్తావన తీసుకుని వచ్చారు. రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేవిగా ఉన్నాయి.