Surprise Me!

Brahmanandam Remuneration Cut Down To Very Low

2018-07-02 2,073 Dailymotion

Film Nagar source said that, Brahmanandam's remuneration has undergone a shocking cut. Apparently, the veteran comedian is now charging a meagre Rs 50,000 per call sheet
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం... కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో నవ్వులు పూయిస్తూ తన హవా కొనసాగించారు. ఒకానొక సమయంలో ఆయన లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. కొన్ని సినిమాలైతే ఆయన కామెడీ వల్లనే హిట్టయ్యేవి. మోస్ట్ డిమాండింగ్ కమెడియన్ కావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకునేవారు. ఒక్కో కాల్ షీటుకు రూ. 2 లక్షల నుండి రూ. 6 లక్షలు వరకు చార్జ్ చేసేవారు. అయితే పరిస్థితి ఒకప్పటిలా లేదని, ఇపుడు డిమాండ్ బాగా తగ్గిందని, రెమ్యూనరేషన్ కూడా భారీగా తగ్గించారని టాక్.
అయితే గడిచిన నాలుగేళ్లుగా బ్రహ్మానందం నటించే సినిమాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. మరో వైపు న్యూ జనరేషన్ కమెడియన్ల హవా సాగుతోంది. దీంతో బ్రహ్మానందం డిమాండ్ దారుణంగా పడిపోయిందని అంటున్నారు.
బ్రహ్మానందం డిమాండ్ తగ్గడానికి కొత్త జనరేషన్ హవాతో పాటు.... ఆయనకు వచ్చే పాత్రలు రోటీన్ అవ్వడం కూడా ఓ కారణం. దర్శకులు, రచయితలు బ్రహ్మాని కొత్తగా ప్రజంట్ చేయడంలో విఫలం అవుతున్నారు. బ్రహ్మానందం జోరు తగ్గడానికి ముఖ్యకారణం దర్శకులు, రచయితలు ఆయనపై సరిగా ఫోకస్ పెట్టక పోవడమే అని చెప్పకతప్పదు.
డిమాండ్ బాగా తగ్గడంతో తన రెమ్యూనరేషన్ కూడా బాగా తగ్గించేశారట ఈ హాస్య చక్రవర్తి. ఇప్పుడు ఒక్కో కాల్ షీట్‌‌కు 50 వేలు చార్జ్ చేస్తున్నారట. ఒకప్పటితో పోలిస్తే అవకాశాలు కాస్త తగ్గాయని ఇండస్ట్రీ టాక్. వయసు పైబడటంతో బ్రహ్మానందం కూడా తనకు నచ్చినవి మాత్రమే కమిట్ అవుతున్నారట. అందుకే బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం చాలా తగ్గిపోయింది.

Buy Now on CodeCanyon