Surprise Me!

వన్ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్

2018-07-02 3 Dailymotion

Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy.
1. నీరవ్ మోడీపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు 13వేల కోట్ల రూపాయలకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోడీపై ఇంటర్‌పోల్ ఈ నోటీసు జారీ చేసింది.

2. ఏపీ టెట్ ఫలితాలు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించింది 57.48శాతం మాత్రమే కావడం గమనార్హం. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా, 3,70,573మంది పరీక్షకు హజరయ్యారు. ఇందులో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

3. దేశంలో ఈసారి వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవవు: వాతావరణశాఖ

దేశవ్యాప్తంగా రుతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే ఒక నెల పూర్తయినప్పటికి కూడా... ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా మూడు నెలల సమయం ఉన్నందును ఇప్పుడే దీనిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

4. అమెరికాలో తెలుగు యువకుడు మృతి

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలంలో గొట్టుముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. నార్త్ కరోలినా సమీపంలో ఛార్లెట్ వద్ద గల జలపాతం సదర్శనకు వెళ్లిన నాగార్జున ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, నాగార్జున గొట్టుముక్కల గ్రామానికి చెందిన టీడీపీ నేత దివంగత గోగినేని వెంకట్రావు మూడో కుమారుడు.దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies

Buy Now on CodeCanyon