Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy...
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies

1. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్
2. రైల్వే ట్రాక్‌పై కూలిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరికి గాయాలు
3. మ్యాచ్ ఓడిన అభిమానుల మనసు గెలిచిన జపాన్
1. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్
తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో తన అరెస్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మంగళవారం కోర్టుకు వెళ్లారు. తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఈ మేరకు ఢిల్లీ కోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు శశిథరూర్‌ను నిందితుడిగా గుర్తిస్తూ జూలై 7న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
2. రైల్వే ట్రాక్‌పై కూలిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరికి గాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్‌పై రైళ్ల రాకపోకను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.