మహేష్ బాబు హీరోగా వంశీ పడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా బుజ్జిగాడు' ఫేం సంజన అలీతో సరదాగా షోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల వయసులోనే తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, మోడలింగ్ చేసే రోజుల్లో బైక్ మీద తిరిగేదాన్ని, ఆ సమయంలో నాకు సినిమా అవకాశం వచ్చింది. దానికి సైన్ చేస్తే రూ. 2 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తామన్నారు. అప్పటికి నాకు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన కూడా లేని వయసు. ఈ సినిమా చేస్తే కారు కొనుక్కోవచ్చుకదా అనే కారణంతో సైన్ చేశాను. కానీ తొలి సినిమాకే నరకం చూశాను. ఆ సినిమా డైరెక్టర్ శాడిస్ట్, సైకో ప్రవర్తనతో ఇండస్ట్రీ అంటే భయం వేసేలా చేశాడు అని తెలిపారు. <br />సంజన ‘గండ హెండతి' అనే కన్నడ సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించింది. హిందీ మూవీ ‘మర్డర్'కు ఇది రీమేక్. ఈ ఒక్క సినిమా డైరెక్టర్ మీద తప్ప అందరు డైరెక్టర్ల మీద నాకు గౌరవం ఉంది అని సంజన తెలిపారు. <br />గండ హెండతి' మూవీ ముందు స్క్రిప్టు పూర్తిగా చదవకుండా సైన్ చేశాను. కానీ స్క్రిప్టు పూర్తిగా చూసిన తర్వాత ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఎక్కువ ఉండటంతో దీనికి నేను న్యాయం చేయలేను అని నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేందుకు వెళ్లాను. నువ్వు కాంట్రాక్టు మీద సంతకం చేశావు, సినిమా చేయకుంటే మోసం చేశావని కేసు పెడతాం అని డైరెక్టర్ బెదిరించాడని సంజన తెలిపారు.