గురువారెడ్డి సెల్ఫీ సూసైడ్ కేసులో పోలీసులు అతని భార్య గాయత్రి, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడిపై కేసు నమోద చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్తింటి వేధింపులు భరించలేక కృష్ణలంకలో ఓ యువకుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఆత్మహత్య చేసుకున్నందుకు తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ, తన భార్య, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు తన ఆత్మహత్యకు కారణం అని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోతో రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపడుతున్నారు.
ఈ ఆత్మహత్యపై గురువారెడ్డి స్నేహితులు ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. గురువారెడ్డి, ఆమె అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అమ్మాయి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లినప్పటి నుంచే గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. హైదరాబాదులో కార్తీక్ అనే యువకుడితో తిరగడం ప్రారంభించిందని తెలిసిందన్నారు.
హైదరాబాదులో మరో వ్యక్తితో తిరుగుతూ భర్తను వదిలేయాలని నిర్ణయించుకుందని ఆ స్నేహితుడు తెలిపారు. గురువారెడ్డికి తెలిసి అడిగితే స్నేహితుడు అని చెప్పిందని, తాను ఇక అతనితో తిరగనని చెప్పిందని, కానీ ఆ తర్వాత గురువారెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేదని, లిఫ్ట్ చేసినా నువ్వు హైదరాబాద్ వస్తే మాట్లాడుకుందని చెప్పేదన్నారు.

Man commits suicide after record a selfie video in Vijayawada.