We already informed you that recently, NTR was blessed with a baby boy, his second kid. NTR is gearing up to give a treat to Telugu audiences and his fans.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులు జూన్ 14న రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇన్‌స్టాలో మరో పోస్టు చేశారు. ఈ పోస్టు ద్వారా తన చిన్న కుమారుడి పేరును అభిమానులకు వెల్లడించారు.
తన రెండో కుమారుడికి భార్గవరామ్ అనే పేరు పెట్టినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. చిన్నోడికి పేరు పెట్టిన సందర్భంగా ఇంట్లో చిన్నపాటి వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటోలో తమ్ముడి భార్గవరామ్‌ను అభయ్ రామ్ ఎత్తుకుని ఉండగా..... ఎన్టీఆర్ ఆ ఇద్దరి ఫోటోను తన సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుట్లు ఉంది.
కొన్ని రోజులుగా ఎన్టీఆర్ షూటింగ్ లేకుంటే ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. తన ఇద్దరు వారసులతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.