పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకొని సినీ విమర్శకుడు మహేష్ కత్తి వివాదాస్పద పోస్టింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత కొద్దికాలంగా సద్దుమణిగిందనుకొన్న పవన్, కత్తి వివాదం మళ్లీ రాజుకొన్నట్టు కనిపిస్తుంది. హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం ఓ కేసులో కత్తి ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్‌ను పోస్టు చేసి మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తున్నది.
నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లను దూషించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఓ ప్రణాళిక బద్దంగా హిందూ మతాన్ని డామేజ్ చేయడానికి కుట్ర జరుగుతున్నది. అలాంటి వారిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం రేపింది.
నాగబాబు వీడియో పోస్టు నేపథ్యంలో మహేష్ కత్తి తీవ్రంగా స్పందించారు. రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్‌ను పోస్టు చేయడం వివాదంగా మారింది. ఇట్స్ హై టైమ్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. నా జోలికి వస్తే మీ హీరో అంతు చూస్తా అని ఉండటం వివాదానికి కేంద్ర బిందువైంది.

Mahesh Kathi indirectly Pawan Kalyan. Presently facing charges making derogatory comments against Hindu god. In this occassion, Nagababu made indirect comments on Kathi. So Kathi reacts with Renu Desai Image.
#MaheshKathi
#RenuDesai