A rowdy sheeter a girl in Warasiguda in Hyderabad from three days.
#Warasiguda

నగరంలోని వారాసిగూడ పరిధిలోని అంబర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై అమీర్ అనే రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకాన్ని గత మూడు రోజులుగా కొనసాగించాడు.
అడ్డుకోబోయిన యువతి తల్లిపై రౌడీ షీటర్ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత యువతి కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కను కూడా రౌడీ షీటర్ తీవ్రంగా కొట్టి హింసించాడు.
కాగా, స్థానికుల సాయంతో బాధిత యువతి చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రౌడీ షీటర్‌పై ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తనపై పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానంటూ బాధిత యువతికి ఫోన్ చేసి నిందితుడు బెదిరింపులకు గురిచేయడం గమనార్హం.