మద్యం సేవించి వాహనాన్ని నడపటం చట్టరీత్యా నేరం అని రవాణాశాఖ చేసిన పలు హెచ్చరికలను బేఖాతరు చేసిన సినీ నటుడు పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం (జూలై 6) రాత్రి చెన్నై నూగబాకం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు, ప్రముఖ నటుడు మనోజ్ కే భారతీరాజా మద్యం సేవించి దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. <br />నూగబాకంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మనోజ్ బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన అనంతరం మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. <br />నూగంబాకంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై మనోజ్ తిరిగి వస్తున్నారు. ఆ ప్రాంతంలో మేము తనిఖీలు నిర్వహిస్తుండగా, బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆ సమయంలో మద్యం సేవించినట్టు గుర్తించాం. అలాగే మితిమీరిన వేగంతో వెళ్లడం కూడా కెమెరాలో రికార్డైంది అని పోలీసులు తెలిపారు.
