Surprise Me!

బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర: పరిపూర్ణానంద

2018-07-09 420 Dailymotion

శ్రీరామచంద్రుడిపై దారుణ వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద మహేష్ కత్తిపై శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా సోమవారం ఆయన ధర్మాగ్రహ యాత్ర ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌ బోడుప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు 3 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. హిందూ ధర్మంపై పెచ్చుమీరుతున్న కుట్రలను, మేధావుల ముసుగులో విచ్ఛిన్నకర శక్తులను ఇంకా ఎన్నాళ్లు భరించాలన్నారు. ఎన్నేళ్లు సహించాలని నిలదీశారు. ఆ కుట్రలను భగ్నం చేసేందుకే ఈ ధర్మాగ్రహ యాత్ర అన్నారు. శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు.

Paripoornananda Swami Press Meet at Somajiguda press club on Mahesh Kathi comments on Lord Srirama.
#paripoornanandaswami
#maheshkathi
#hindu
#kcr
#chandrababunaidu
#andhra pradesh

Buy Now on CodeCanyon