రామ్ చరణ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, సమంత, అనసూయ ప్రధాన తారాగణంగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన 'రంగస్థలం' 100 రోజుల వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా సక్సెస్ అనేది వన్ మ్యాన్ డ్రీమ్... ఆ వన్ మ్యాన్ సుకుమార్. ఆయన ఆలోచన, రైటింగ్ నుండే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అన్నారు. ఈ వేడుకలో అనసూయ తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. <br />నాన్నగారు తిరిగి ఖైదీ నెం 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినపుడు ఓ విషయం గమనించాను... ఒక వ్యక్తికి ఇంత ఆదరణ, ప్రేమ కేవలం మంచి సినిమాల వల్లనో, గ్రేట్ క్యారెక్టర్ల వల్లనో రాదు. ఆయన ఒకటే అనేవారు... మనం ఎదిగేటపుడు మనతో పాటు పది మందిని పైకి తీసుకెళ్లాలి. ఒక వేళ మనం పడిపోతే ఆ పది మందే మనల్ని కాపాడుతారు అని చెప్పేవారు... మా ఇండస్ట్రీని, మమ్మల్ని కాపాడేవారు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. <br /> <br />Ram Charan Superb Speech at Rangasthalam 100 Days Celebrations. Rangasthalam 2018 Telugu Movie ft. Ram Charan, Samantha, Pooja Hegde, Anasuya and Aadhi Pinisetty. #Rangasthalam is Directed by Sukumar. Music by DSP / Devi Sri Prasad. Produced by Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri under Mythri Movie Makers banner.