Surprise Me!

Pawan Kalyan Emotional Speech About His Daughter

2018-07-09 2,315 Dailymotion

సినిమాలను పక్కన పెట్టేసి తన పూర్తి సమయం ప్రజా సేవ కోసమే కేటాయించిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పోరాట యాత్ర పేరుతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన విశాఖలో ప్రసంగిస్తూ తన సినిమాలు, కుటుంబం గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేయడం కంటే ప్రజా సేవ చేయడమే ఇష్టమని తెలిపారు. మాతో ఉండటం లేదని నా బిడ్డలు బాధ పడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది అని పేర్కొన్నారు. <br />నేను బేసిగ్గా నటుడిని కాదు. నటుడిగా చేయబడ్డాను. అది భగవంతుడి నిర్ణయం అయుండొచ్చు. నటుడిగా ఏమీ ఆశించలేదు. చేసిన సినిమాలు కూడా చాలా తక్కువే. ఐదారు సినిమాలు వంద సినిమాలు చేసినంత ఇమేజ్ తీసుకొచ్చాయి. అది భగవంతుడి కృప తప్ప నా కృషి ఏమీ లేదు. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది... అని పవన్ కళ్యాణ్ అన్నారు. <br />నాకు చిన్నప్పటి నుండి ఏ పని చేస్తున్నా నా ఆలోచన అంతా ప్రజాసేవ వైపే ఉండేది. సినిమాలు నేను ఇష్టంగా చేసింది కాదు... పరిస్థితుల కారణంగా నటుడిని అయ్యాను. అందుకే నేను ఎప్పుడూ నా సినిమా సభలు జరుపుకోలేదు. సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ క్లబ్స్ పెట్టలేదని పవన్ తెలిపారు. <br /> <br />Pawan Kalyan Emotional About his daughter Request. Pawan Kalyan, is an Indian film actor, producer, director, screenwriter, writer, and politician. His film works are predominantly in Telugu cinema. He is the younger brother of popular actor turned politician Chiranjeevi.

Buy Now on CodeCanyon