దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు సోమవారం ప్రకటించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వైయస్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోటి సంతకాల ఉద్యమాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్, గౌరు చరిత, రవీంద్రనాథ్ రెడ్డి, కోన రఘుపతి, ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. <br /> వైయస్‌కు భారతరత్న కోరుతూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఈ కోటి సంతకాల సేకరణను ప్రారంభించింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సెల్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, వైసీపీ నేతలు కారుమూరి నాగేశ్వర రావు, లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. <br /> <br />The North American Telugu Association (NATA) has resolved to collect over one crore signatures demanding Bharat Ratna for late YS Rajasekhara Reddy. <br />#RajasekharaReddy