1. గుజరాత్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్య
2. రూ.1212కే ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్
3. ఫ్రాన్స్, బెల్జియంల మధ్య సెమీస్‌కు సర్వం సిద్ధం
1. గుజరాత్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్య
చాలా కాలం విరామం తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్‌లోని గుజరాత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఒక ఎయిర్ బేస్ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల మధ్య ఈ నిర్మాణం జరిగినట్లు సమాచారం. తమ మిలటరీ ఆపరేషన్స్ కోసం అత్యాధునిక ఎయిర్ ఫీల్డ్‌ను హైదరాబాద్ జిల్లాలోని భోలారిలో అభివృద్ధి చేసింది. ఇక్కడ చైనాలో తయారైన జేఎఫ్ -17 యుద్ధ విమానాలను ఇక్కడ ఉంచుతుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే భారత్‌కు ఉన్న యుద్ధ విమానాలను తట్టుకునేందుకు పాకిస్తాన్ చైనాకు చెందిన జేఎఫ్ -17 యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
2. రూ.1212కే ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్
బడ్జెట్ ప్రయాణికులకు ఎంతో దగ్గరైన విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ తన12వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది. ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకుగాను నేటి నుంచి నుంచి జులై 13వ తేదీ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది.
3. ఫ్రాన్స్, బెల్జియంల మధ్య సెమీస్‌కు సర్వం సిద్ధం
ఫిఫాలో భాగంగా.. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టు.. బెల్జియంను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖిలో బెల్జియందే పైచేయి. ఐతే ప్రపంచకప్‌లో మాత్రం ఆధిపత్యం ఫ్రాన్స్‌దే. బెల్జియంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఫ్రాన్స్ ఓసారి ప్రపంచకప్ నెగ్గగా.. 'రెడ్ డెవిల్స్' తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది. క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం 2-1తో ఫేవరెట్ బ్రెజిల్‌కు షాకివ్వగా.. ఫ్రాన్స్ 2-0తో ఉరుగ్వేను ఓడించింది.

Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy...
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies