జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 16వ తేదీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాలు.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఇటీవలే ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలని భావిస్తున్నారు.

Jana Sena chief Pawan Kalyan to tour East and West Godavari districts from 16.
#JanaSena
#PawanKalyan