Karthi's ChinnaBabu movie twitter review. Chinnababu movie grand release world wide today
#ChinnaBabumovie

లక్షణ నటుడు సూర్య సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తీ తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో తనకంటూ ప్రత్యకమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. నా పేరు శివ, ఆవారా, ఖాకి వంటి హిట్ చిత్రాలు కార్తీ ఖాతాలో ఉన్నాయి. చివరగా విడుదలైన ఖాకి చిత్రం కార్తీ వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. తాజాగా విడుదలవుతున్న చినబాబు చిత్రంతో కార్తీ తన సత్తాని పూర్తి స్థాయిలో చాటాలని భావిస్తున్నాడు. సాయేషా, కార్తీ జంటగా నటించిన ఈ చిత్రం రైతు ప్రాధాన్యతని తెలియజేసే కథాంశంతో వస్తుండడం విశేషం. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆడియన్స్ రెస్పాన్స్, చిత్ర విశేషాలు తెలుసుకుందాం.
చినబాబు చిత్రానికి ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ అందరికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.
చినబాబు చిత్రం నేడు విడుదల కాబోతోంది. ఫన్, ఎమోషన్స్ రెండూ ఈ చిత్రంలో ఉండనున్నాయి.
తమిళంలో చినబాబు చిత్రం కడైకుట్టి సింగం పేరుతో విడుదలవుతోంది. తమిళ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.