భారత క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వరల్డ్‌కప్ సాధించడం లేదా వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో పాకిస్థాన్ జట్టుపై టీమిండియా విజయం సాధించడం లాంటివి. అలాంటి మ్యాచ్‌లు భారత క్రికెట్ అభిమాని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.<br /><br />ఈ కోవలోకి వచ్చే ఓ గొప్ప మ్యాచ్ నాట్‌వెస్ట్ ఫైనల్ మ్యాచ్(జులై 13, 2002). ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గుర్తుకు రాగానే ముందుగా మదిలో మెదిలే అపురూప ఘట్టం టీమిండియా మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ చొక్కా విప్ప చేసిన హంగామా.
