Trisha’s Mohini movie trailer released. This film based on supernatural incidents
#Mohinimovietrailer
#Trisha

తెలుగు, తమిళ భాషల్లో త్రిష ఒక్కప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. హద్దులు దాటని గ్లామర్, అద్భుతమైన నటనతో త్రిష క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. చాలా కాలం పాటు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా త్రిష కొనసాగింది. 35 ప్లస్ లో ఉన్న ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రావడం లేదు. అరాకొరా చిత్రాలు ఉన్నప్పటికీ అవి లేడి ఓరియంటెడ్ రోల్స్ కావడం విశేషం. చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన త్రిష నటించిన మొహిన్ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజగా మోహిని చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
మోహిని చిత్రం అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ట్రైలర్ చూస్తుంటే హర్రర్ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. ట్రైలర్ లో త్రిష అన్ని రకాల నటనని చూపించారు. రొమాంటిక్,స్టైలిష్, హర్రర్ లుక్స్ లో త్రిష అదరగొడుతోంది.