తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులపై విరుచుకుపడుతున్న శ్రీరెడ్డికి షాకిచ్చేందుకు దర్శకుడు సుందర్ సీ సిద్ధమవుతున్నాడు. ప్రముఖ కుష్బూ భర్త అయిన సుందర్ సీపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సుందర్ సీ సిద్దమవుతున్నట్టు సమాచారం. సుందర్ సీపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే. <br />హైదరాబాద్‌లో అరన్‌మనయ్ షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్‌తో కలిసి వెళ్లి సుందర్ సీని కలిశాను. ఆ రోజే నా ఫేస్‌బుక్ ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ను కలిశాను. ఆ సందర్భంగా తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తాను అని చెప్పారు. ఆ తర్వాత నన్ను నోవాటెల్‌కు రమ్మన్నాడు. శారీరక సుఖాన్ని ఇవ్వమని కోరాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించింది. <br /> అంతేకాకుండా నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ, మరో హీరో శ్రీకాంత్‌పై కూడా శ్రీరెడ్డి దారుణమైన కామెంట్లు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై లారెన్స్, శ్రీకాంత్ కూడా స్పందించారు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. నిజం లేదు అని మీడియాకు ఓ ప్రకటన జారీ చేశారు. సినిమా అవకాశాల కోసం ఒకరిని సిఫారసు చేసే అలవాటు తనకు లేదని శ్రీకాంత్ వెల్లడించారు.